Oct 28,2021 15:28

ప్రజాశక్తి - ఆలమూరు
జనసేన అధినేత పవన్‌ అందరివాడని కార్యకర్తలంతా పార్టీకి అండగా ఉండాలని నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మండలంలోని గుమ్మిలేరు, మోదుకూరు, నర్సిపూడి , నవాబుపేట, పెనికేరు, చెముడులంకలలో గురువారం ఆయన విస్త్రుతంగా పర్యటించారు. ఇందులో భాగంగా పార్టీ గ్రామ కమిటీల ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేనాని అడుగుజాడల్లో అందరం నడుద్దామన్నారు. అన్ని వర్గాలను ఆదరించే నాయకుడు పవన్‌ మాత్రమేనన్నారు. జనసేన పార్టీని మరింత బలోపేతం దిశగా, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలను ఆయన కోరారు. అనంతరం జనసేనలోకి వచ్చిన వారికి కండువా కప్పి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్‌ నాయకులు తాళ్ల డేవిడ్‌ రాజు, సర్పంచ్‌ సంగీత శభాష్‌, నేతలు జయప్రకాశ్‌ నారాయణ, త్రిమూర్తులు, నగేష్‌, సత్య, వెంకన్న, ఎంపీటీసీలు నాగలక్ష్మి అమ్మిరాజు, భాస్కర్రావు, పట్టాభి రామన్న, జాంపోలు నాగేశ్వరరావు, అధిక సంఖ్యలో జన సైనికులు పాల్గొన్నారు.