Jun 11,2021 16:32

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్

        కార్మికుల సమస్యల పరిష్కారానికై శుక్రవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఉద్యోగ , కార్మిక సంఘం ఆధ్వర్యంలో అర్ద నగ్న ప్రదర్శన   నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షలు నాగేంద్ర కుమార్, మునిసిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి నాగభూషణ, సీఐటీయూ నగర అధ్యక్షులు RV నాయుడు, కార్యదర్శి వెంకటనారాయణ హాజరై మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, కరోనాతో చనిపోయిన కార్మికుని కుటుంబానికి యాభై లక్షల ప్రమాద భీమా ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, పని భద్రత కల్పిస్తూ, సకాలంలో  రక్షణ పరికరాలు ఇచ్చి, కార్మికులందరికీ మెరుగైన వైద్యం అందించాలని అన్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల వారి సమస్యల మీద 15 రోజులుగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించని కారణంగా ఈ రోజు అనంతపురం నగర పాలక సంస్థ 6 సర్కిల్ నందు అర్ద నగ్న ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్ర కుమార్మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పెరిగిన నగరానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచి  కార్మికుల మీద పని భారాన్ని తగ్గించాలని, కరోనాతో చనిపోయిన కార్మికులకు 50 లక్షల బీమా వెంటనే అమలు చేయాలని, కార్మికులు అందరికీ ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని, ఈఎస్ఐ కార్డులు వెంటనే ఇవ్వాలని, బకాయి ఉన్న ఈపీఎఫ్ కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ప్రస్తుత కరోనా పరిస్థితులలో ప్రజల మీద, కార్మికుల మీద భారం పడే విధంగా ఆస్తి పన్ను,చెత్త పన్ను, కాలువ పన్ను, అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలను వెంటనే రద్దు చేయాలని, కార్మికుల సమస్యల మీద  రాష్ట్ర వ్యాప్తంగా14,15వ తేదీలలో సమ్మె నిర్వహిస్తున్నామనిఅప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంస్పందించకపోతే  నిరవధిక సమ్మెలోకి పోవడానికి సిద్ధంగా ఉన్నామని, సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, అర్ధనగ్న ప్రదర్శన తో చెట్ల కొమ్మలతో ఒళ్ళు కు కట్టుకొని,ర్యాలీ నిర్వహించి మోకాళ్ళ పై కూర్చొని నిరసన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోమునిసిపల్ యూనియన్ నగర అధ్యక్షులు /కార్యదర్శి  ఎటిఎం నాగరాజు, లక్ష్మీనారాయణ, ట్రెజరర్ తిరుమలేష్, మహిళా నాయకురాలు వరలక్ష్మి, ఉపాధ్యక్షులు ఎర్రిస్వామి, సహాయ కార్యదర్శి ఆదినారాయణ, శేసెంద్ర కుమార్, రవి రేణుక,  శ్రీనివాసులు, కిరణ్, నాగలింగం, ఈమంబి, అంజి, ప్రభాకర్, లక్ష్మీదేవి, తదితరులు పాల్గొనడం జరిగింది.