Mar 02,2021 23:09

కాఫీ ప్లాంట్‌ స్థలాన్ని పరిశీలిస్తున్న సబ్‌కలెక్టర్‌ మౌర్య

కోటవురట్ల : మండలంలోని కొడవటిపూడి గ్రామం వద్ద ఏర్పాటుకానున్న కాఫీ ప్లాంట్‌ స్థలాన్ని నర్సీపట్నం సబ్‌ కలెక్టర్‌ నారపరెడ్డి మౌర్య మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 3.34 ఎకరాల భూమిలో ఏర్పాటుచేయనున్న ఈ ప్లాంటుకు వ్యవసాయ భూమి కేటాయించడంతో సమీపంలోని రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని తహశీల్దార్‌ రామారావుకు సూచించారు. ప్లాంట్‌ వద్ద అన్ని ఏర్పాట్లూ చేయాలని, పక్కా రహదారి ఉండాలని ఆదేశించారు.