Oct 27,2021 22:07

కాపు సంక్షేమ సేన రాష్ట్ర కార్యదర్శి కొట్టె వెంకట్రావ్‌
ప్రజాశక్తి కలక్టరేట్‌ :
కాపుల సంక్షేమాన్ని వైసిపి ప్రభుత్వం విస్మరిస్తుందని కాపు సంక్షేమ సేన రాష్ట్ర కార్యదర్శి కొట్టె వెంకట్రావ్‌ తెలిపారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని, ఎన్నికల ముందు కాపు కార్పొరేషన్‌ కు కేటాయిస్తామన్న వెయ్యి కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ, కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో బుధవారం మచిలీపట్నం కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాపుల సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి పోస్ట్‌ కార్డుల ద్వారా పంపారు. అనంతరం కొట్టే వెంకటరావు మాట్లాడుతూ పోస్టుకార్డుల ద్వారా కాపుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేస్తామన్నారు.ఈ ఉద్యమానికి స్పందించకపోతే సీఎం జగన్‌ ఇంటిని ముట్టడికి వెనుకాడబోమన్నారు.కాపుల హక్కుల సాధనకై అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. కాపుల కోసం ఏ కాపు సంఘం ఉద్యమం చేపట్టినా ఆ సంఘానికి రాధా-రంగా మిత్ర మండలి మద్దతు ఇస్తుందని కష్ణాజిల్లా అధ్యక్షులు బుల్లెట్‌ ధర్మారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సేన ప్రతినిథులు, నున్న అరవింద్‌ కుమార్‌, పుప్పాల ప్రసాద్‌, సురిశెట్టి హరికష్ణ, లంకిశెట్టి నీరజ, పుప్పాలరత్న మాణిక్యం, వివిధ కాపు సంఘాల ప్రతినిథులు పాల్గొన్నారు.