Jun 11,2021 14:50

ప్రజాశక్తి-ఆదోనిరూరల్

   వైద్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న పారా మెడికల్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పెద్దహరివాణం పిహెచ్ పారామెడికల్ సిబ్బంది వాసుదేవ రెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆరోగ్య కేంద్రాల ముందు నిరసన చేపట్టారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్య శాఖలో 20 ఏళ్లగా సేవలు అందిస్తున్నామన్నారు.కష్ట కాలంలో అందిస్తున్న సేవలను గుర్తించాలన్నారు. విధినిర్వాహణలో ప్రజల ప్రాణాలను కాపాడుటలో తమ ప్రాణాలను సహితం లెక్క చేయకుండా, వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు విధానం ద్వారా విధులు నిర్వహిస్తూ భద్రత లేకుండా ఉన్నా, ఉద్యోగులు విధినిర్వహణలో అనేక మంది మరణించారని, ఆ ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, జీవించి విధుల్లో ఉన్న వారికి రెగ్యులరైజేషన్, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, వారిని ఆర్థికంగా ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పెద్దహరివాణం డాక్టర్ రామచంద్రుడుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.