Jan 25,2021 21:35

చింతూరు(తూర్పు గోదావ‌రి): ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు ఓ కాంట్రాక్టర్‌ను హత్య చేశారు. బీజాపూర్‌ జిల్లాలో అభివఅద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్డు నిర్మాణంతో పాటు వంతెనల నిర్మాణం చేపట్టారు. నిర్మాణ పనులను ఆపివేయాలని కాంట్రాక్టర్‌ను మావోయిస్టులు గతంలో హెచ్చరించారు. మావోయిస్టుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కాంట్రాక్టర్‌ బేర్‌పాల్‌, కోటేర్‌ గ్రామాల మధ్య వంతెన నిర్మాణం పనులను చేపట్టారు. దీంతో 12 మంది మావోయిస్టులు సోమవారం వంతెన వద్ద కాంట్రాక్టర్‌ ధర్మేంద్రగర్గ్‌(50)ను గొడ్డళ్లతో నరికి హత్య చేశారు.