Feb 23,2021 13:21

బ్రాజ్‌విల్‌ : కాంగోలోని ఐరాస కాన్వాయ్పై జరిగిన దాడిలో ఇటలీ రాయబారి మృతిచెందినట్లు ఇటలీ విదేశాంగ శాఖ తెలిపింది. గోమాకు ఉత్తరాన ఉన్న కన్యామహోరో పట్టణానికి సమీపంలో వారి కాన్వాయ్పై దాడి జరిగిందని అధికారులు తెలిపారు. ఇటలీ రాయబారి లూకా అట్టాన్సియోతో పాటు ఇద్దరు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. దాడి జరిగిన సమయంలో కారులో లూకాతో పాటు ఐదుగురు ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. కాగా, ఈ దాడికి బాధ్యులము తామేనంటూ ఎవరూ అధికారికంగా ప్రకటించలేదని అన్నారు.