Jun 11,2021 13:29

ముంబై: ప్రముఖ నటుడు సోనూసూద్‌ కరోనా కష్టకాలంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలకు యావత్‌ దేశమంతా అభిమానులున్నారు. ఇప్పటికే చాలామంది.. ఆయనపై ఉన్న అభిమానాన్నిచాటుతూ.. సోనూసూద్‌ విగ్రహాన్ని ప్రతిష్టించడం, ఆయన పేరు మీద పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం వంటివి చూస్తూనే ఉన్నాము. అయితే ఓ వీరాభిమాని తనపై ఉన్న అభిమానాన్ని ఎలా చాటుకున్నాడో తెలుసా..? వికారాబాద్‌కు చెందిన వెంకటేష్‌ అనే వ్యక్తి 700 కిలోమీటర్లు చెప్పుల్లేకుండా.. కాలినడకన ముంబై వెళ్లి సోనూసూద్‌ని కలిశారు. కాలి నడకన తనను చూడటానికి వచ్చిన వెంకటేష్‌ని చూసి సోనూ చలించిపోయారు. తన యోగక్షేమాలు అడిగి.. వెంకటేష్‌తో కలిసి ఫొటో దిగారు. తన అభిమాని కాలినడకన రావడంపై సోనూ స్పందిస్తూ.. 'అతన్ని చూస్తే నాకు చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. కానీ నా కోసం అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ రావడం నాకు బాధగా ఉంది. అందుకే నేను ఇలాంటి వాటిని అస్సలు ఎంకరేజ్‌ చేయను' అని ట్వీట్‌ చేశారు.

sonusood 1