Oct 27,2021 09:38

కాలీ ఫ్లవర్‌ శీతాకాలంలో విరివిగా దొరుకుతుంది. క్యాలరీలు చాలా తక్కువగా, విటమిన్లు ఎక్కువగా ఉండే కాలీఫ్లవర్‌ ఆరోగ్యానికి ఎంతో మంచిది.
వారంలో ఒక్కసారైనా కాలీ ఫ్లవర్‌ని తీసుకోవడం వల్ల హుద్రోగ సమస్యలతో పాటు ఎన్నో వ్యాధులను దూరం చేసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
కాలీ ఫ్లవర్‌ శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఆహారంలో కాలీఫ్లవర్‌తో వండిన పదార్థాలను భాగం చేసుకుంటే అజీర్తి సమస్య నుంచి బయటపడతారు.
కాలీ ఫ్లవర్‌ రసాన్ని పరగడపునే తాగడం ద్వారా క్యాన్సర్‌ని దూరం చేసుకోవొచ్చు.
కాలీ ఫ్లవర్‌ని పచ్చిగా తినడం వల్ల దంతసమస్యలు దూరమవుతాయి. రక్తంలో షుగర్‌ని అదుపులో ఉంచుకునేందుకు కూడా కాలీఫ్లవర్‌ ఉపయోగపడుతుంది. మధుమేహగ్రస్తులు దీన్ని వారంలో ఒక్క రోజైనా తీసుకోవాలి.
జీర్ణక్రియను వేగవంతం చేసే కాలీ ఫ్లవర్‌. కడుపులోని అసిడిటీ కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాబట్టి ఎసిడిటీ సమస్య ఉన్నవారు కాలీఫ్లవర్‌ తీసుకుంటే సమస్య నుంచి ఉపశమనంగా ఉంటుంది.
కాలీ ఫ్లవర్‌లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది.