Apr 11,2021 14:45

తిరువూరు(కృష్ణా): జనవిజ్ఞానవేదిక తిరువూరు, శ్రీశ్రీ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో మహాత్మాజ్యోతీరావుపూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి జనవిజ్ఞానవేదిక సీనియర్‌ నాయకులు జె.ఆనందరావు, యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు పి.శీనయ్యలు నివాళులర్పించారు. జనవిజ్ఞాన వేదిక, శ్రీశ్రీ అధ్యయన కేంద్రం నాయకులు, తదితరులు పాల్గన్నారు.