Nov 16,2020 07:29

నిరంకుశంగా నీవణిచి వేస్తే
నిబ్బరంగా మేమెగిసిపడతాం
ఉక్కుపాదం నీవెక్కి పెడితే
కొదమ సింగాలై కదలి వస్తాం
నియంతృత్వం నీ ఆయుధమైతే
నిప్పురవ్వలై ఎగిసిపడతాం
లాఠీ, తూటా నీవెక్కి పెడితే
ఉగ్రనేత్రులై ఉద్యమిస్తాము

అణచివేత నీ విధానం
న్యాయం మా నినాదం
తొక్కేయడం నీ నైజం
తిరుగుబాటు మాకనివార్యం
జూలు విదిల్చిన సింహాలం మేము
రాజ్యం మీ భోజ్యం అయితే
జ్వాలాచలనమై జ్వలిస్తాం
వెలుతురు బంధించాలనుకుంటే
లావాలా ఎగసి పడతం
ఇప్పుడే కాదు... ఎప్పటికీ
విజయం వీరులదే..
మేము వీరులం... మేమే విజేతలం!
 

- రెడ్డి శంకరరావు
94943 33511