Feb 23,2021 19:18

సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తున్న 'రిపబ్లిక్‌' సినిమా టైటిల్‌తోనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవా కట్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలకపాత్ర పోషిస్తోంది. పొలిటికల్‌ డ్రామాగా రూపొందు తున్న ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా 'రిపబ్లిక్‌' సినిమా పూర్తయిందంటూ చిత్రబృందం ఒక ఫొటోను పంచుకుంది. 64 రోజుల్లో ఎలాంటి కొవిడ్‌ కేసులు లేకుండా చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేశామని దేవా కట్ట తెలిపారు. తన కెరీర్లో ఇదొక ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని సాయి ధరమ్‌ తేజ్‌ పేర్కొన్నాడు. జూన్‌ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.