Sep 24,2021 01:41

పోటీలను ప్రారంభిస్తున్న జిసిసి చైర్‌పర్సన్‌ స్వాతీరాణి

ప్రజాశక్తి - కలెక్టరేట్‌
జర్నలిస్టుల సమైక్యతకు క్రీడా పోటీలు స్ఫూర్తిదాయకమని విఎంఆర్‌డిఎ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల, జిసిసి చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి, ఎపిఈపీడీసీఎల్‌ సిఎండి కె.సంతోషరావు, డైరెక్టర్‌ బి.రమేష్‌ప్రసాద్‌ అన్నారు. గురువారం పోర్టు స్డేడియంలో వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం, సిఎంఆర్‌, విస్జా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్‌ మీడియా క్రికెట్‌ పోటీలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం పని ఒత్తిడితో ఉండే జర్నలిస్టులకు ఈ తరహా క్రీడా పోటీలు మానసిక ప్రశాంతత, మెరుగైన ఆరోగ్యానికి దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో విజెఎఫ్‌ ప్రతినిధులు గంట్ల శ్రీనుబాబు, ఎస్‌.దుర్గారావు, ఆర్‌.నాగరాజు పట్నాయక్‌, దాడి రవికుమార్‌, స్పోర్ట్స్‌ జర్నలిస్టుల అసోసియేషన్‌ అధ్యక్షుడు ఉమాశంకర్‌బాబు, సభ్యులు దొండా గిరిబాబు, ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌, ఇరోతి ఈశ్వరరావు, పైలా దివాకర్‌ తదితరులు పాల్గొన్నారు.