Mar 02,2021 21:41

సమావేశంలో మాట్లాడుతున్న ఎన్నికల ప్రత్యేకాధికారి కూర్మనాధ్‌

పార్వతీపురం టౌన్‌: ఎన్నికల్లో జోనల్‌ అధికారుల పాత్ర చాలా కీలకమని, సిబ్బందిని సమన్వయపర్చే బాధ్యత వారిదేనని, బాధ్యత, సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఐటిడిఎ పిఒ, మున్సిపల్‌ ఎన్నికల ప్రత్యేక అధికారి ఆర్‌ కూర్మనాథ్‌ అన్నారు. ఎన్ని కలకు సంబంధించి జోనల్‌, రూట్‌ అధికారులకు సోమవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో ఎన్నికల సరళిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్‌ అధికారుల సామర్థ్యంపైనే ఎన్నికల ప్రక్రియ ఆధారపడి ఉంటుందని, ఆర్‌ఒలు, పిఒలు, ఇతర ఎన్నికల అధికారులు, సిబ్బందిని సమన్వయ పరిచే బాధ్యత జోనల్‌ అధికారుదే అన్నారు. స్థానిక మున్సిపల్‌ ఎన్ని కలకు సంబంధించి 26 ప్రాంతా ల్లో కేటాయించిన 49 పాఠశాల భవనాల్లో గల పోలింగ్‌ బూత్‌ల్లో మంచినీరు, విద్యుత్‌, వసతి, ట్రై సైకిల్‌, ర్యాంపు వంటివి అం దుబాటులో ఉన్నదీ లేనిదీ ప్రధా నోపాధ్యాయులు ముందుగా పరిశీలించాలని, లేకుంటే జోనల్‌ అధికారులకు తెలియజేసి సమకూర్చుకోవాలని అన్నారు. అలాగే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. జోనల్‌ అధికారులు ఎన్నికల ముందురోజు సిబ్బంది అంతా హాజరైనదీ, వారికి అవసరమైన సామగ్రి అందినదీ లేనిదీ పరిశీలించాల్సి ఉంటుం దన్నారు. ఎన్నికల రోజు ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ను జోనల్‌ అధికారులు కనీసం రెండుసార్లైనా పరిశీలించాలని చెప్పారు. జెడ్‌ఒలు పోలింగ్‌ స్టేషన్లను ఎంత ఎక్కువగా సందర్శిస్తే, అంత సజావుగా ఎన్నిక జరుగుతుందని సూచించారు. ఓటింగ్‌ ఎక్కువగా జరిగేలా చూడడం, నిర్ణీత సమాయానికి పోలింగ్‌ ప్రారంభించడంతో పాటు, సకాలంలో ముగిసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సక్రమంగా అందించే బాధ్యతను జోనల్‌ అధికారులు నిర్వర్తించాలని సూచించారు. తహశీల్దార్‌ శ్రీరామమూర్తి, మున్సిపల్‌ డిఇ అప్పారావు, టిపిఒ, మేనేజర్‌ పాల్గొన్నారు.