Dec 04,2021 03:12

మాట్ల్లాడుతున్న మేయర్‌

ప్రజాశక్తి -విశాఖపట్నం:మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ స్థాయి సంఘ సమావేశం శుక్రవారం కమిటీ చైర్‌ పర్సన్‌ గొలగాని హరి వెంకట కుమారి అధ్యక్షతన జరిగింది. స్థాయి సంఘం అజెండా లో మొత్తం 26 అంశాలు పొందు పరిచారు. 26 అంశాలలో 25వ అంశానికి సరైన పూర్తి సమాచారం లేనందున వాయిదా వేశామని స్థాయి సంఘం కమిటీ చైర్‌ పర్సన్‌ తెలిపారు. మిగిలిన అన్ని అంశాలు ఆమోదం పొందాయని తెలిపారు. ఈ సమావేశంలో జివిఎంసి కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మిశ, అదనపు కమిషనర్‌ విజయభారతి, డి.సి.(రెవెన్యూ) పి.నల్లనయ్య, ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ ఇ.వాసుదేవ రెడ్డి, పి.ఆర్‌.ఒ. ఫణిరాం, పర్యవేక్షక ఇంజినీర్‌ వేణుగోపాల్‌, జోనల్‌ కమిషనర్‌ చక్రవర్తి, శివప్రసాద్‌, కార్యనిర్వాహక ఇంజనీర్లు, ఉప కార్యనిర్వహక ఇంజనీర్‌ తదితరులు పాల్గొన్నారు.