Jun 13,2021 00:23

కాటాల వద్ద నిలిచి పోయిన సుబాబులు కర్ర

ప్రజాశక్తి-చీమకుర్తి: జిఒ నెం.31 ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం సుబాబుల్‌ కర్ర కొనుగోలు చేయాలని బాపట్ల పార్లమెంట్‌ తెలుగురైతు అధ్యక్షులు కొండ్రుగుంట వెంకయ్య డిమాండ్‌ చేశారు. శనివారం స్థానికంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో సుబాబులు టన్ను రూ.5 వేలు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జిఒ నెం.31 ప్రకారం మార్కెట్‌ కమిటీల ద్వారా కర్ర కొనుగోలు చేయాలనీ, లేకుంటే అన్ని రైతు సంఘాలతో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.