Oct 27,2021 22:02

ఫొటో : నిరసన తెలుపుతున్న అసోసియేషన్‌ నాయకులు

ఫొటో : నిరసన తెలుపుతున్న అసోసియేషన్‌ నాయకులు
జిఒ 10ని రద్దు చేయాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : జీవో నెంబర్‌ 10ని రద్దుచేసి యథావిధంగా గోను సంచులను డీలర్ల కే ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాలుగు మండలాల డీలర్ల అసోసియేషన్‌ రెండోరోజు నిరసన తెలిపారు. బుధవారం ఉదయగిరి స్థానిక ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉదయగిరి సీతారాంపురం వరికుంటపాడు మర్రిపాడు మండలాల డీలర్ల అధ్యక్ష కార్యదర్శుల డీలర్లతో రెండవ రోజు నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మండలాల వారీగా సమస్యలు పరిష్కరించే వరకు నవంబర్‌ నెలలో ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో సరుకు దింపుకోమని వెంటనే ప్రభుత్వం జీఓ 10 నీ రద్దుచేసి డీలరుకు సంచులను అప్పగించి మే నెల నుండి రావాల్సిన పెండిగ్‌ బకాయిలను ఇచ్చి వారిని వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.
కోటా పంపిణీ చేయగా డీలరుకు గోతాలకు 2 నుంచి 3వేల రూపాయల వరకు వస్తాయని దానితో షాపు అద్దె, సరుకు దిగుమతి చార్జీలు, విద్యుత్‌ చార్జీలు డీలరే భరించాల్సి వస్తుందని కానీ పౌరసరఫరాల శాఖకు 2020 సం నుండి కరోనాను సాకుగా చూపించి ఖాళీగోని సంచులను ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో ఇవ్వాలని డీలరుపై వత్తిడి తెచ్చి మీపై 6ఎ కేసులు పెట్టతామని బెదిరిస్తు మే నెల నుండి గోనూ సంచులకు 20 రూపాయలు ఇస్తామని చెప్పి ఇంతవరకు చెల్లిచకా అదికారులు ఇప్పుడు ఇలా మాట తప్పడం భావ్యం కాదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి డీలర్లకు రాజశేఖర్‌ రెడ్డి ఇచ్చిన జీవో అమలు చేసి డీలరుకు ఆదాయ వనరులుగా వున్న ఖాళీగోతాలను లోక్కోవండం దుర్మార్గపు చర్య అని దేశంలో ఎక్కడా ఈ తరహా విధానం లేదని ఆంధ్రప్రదేశ్‌ లోనే అమలు చేయడం సహేతుకంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల డీలర్ల అధ్యక్షులు కార్యదర్శులు డీలర్లు పాల్గొన్నారు.