Apr 14,2021 21:16

దుబాయ్‌: జింబాబ్వే క్రికెట్‌జట్టు మాజీ కెప్టెన్‌ హీత్‌ స్ట్రీక్‌పై 8ఏళ్ళ నిషేధం విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్‌కంట్రోల్‌బోర్డు(ఐసిసి) ప్రకటించింది. సమాచారాన్ని బహిర్గత చేయడం, అవినీతిని ప్రోత్సహించే చర్యలకు పాల్పడడంతో స్ట్రీక్‌ను అన్నిరకాల ఫార్మాట్‌నుంచి నిషేధం విధిస్తున్నట్లు ఐసిసి అవినీతి నిరోధక జనరల్‌ మేనేజర్‌ అలెక్స్‌ మార్షల్‌ బుధవారం తెలిపారు. హీత్‌ స్ట్రీక్‌ ఐదు ఉల్లంఘనలకు పాల్పడినట్లు, 2017, 2018లో ఐపిఎల్‌, బిపిఎల్‌ సహా మరికొన్ని లీగ్‌లలో ఈ ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఐసిసి అవినీతి నిరోధక శాఖ గుర్తించిందన్నారు. జింబాబ్వే జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గానూ పనిచేసిన స్ట్రీక్‌ ఆ జట్టు తరఫున గతంలో ఉత్తమ పేసర్‌గా పేరుగాంచాడు.