ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరులో 247 వార్డు వాలంటీర్లు పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుం టున్నట్టు కమిషనర్ చల్లా అనురాధ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈనెల ఒకటో తేదీ నుంచి నగరంలో నివశిస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పదో తరగతి పూర్తయి 35 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ పట్టణాల్లో 148 వాలంటీర్ల పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. డిసెంబరు 2 నుంచి 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మొత్తం 395 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్టు ఆమె చెప్పారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, 7వ తేదీన దరఖాస్తుల పరిశీలన, 8 నుంచి 10 వరకు మౌఖిక పరీక్షలు ఉంటాయని, 11వ తేదీన ఎంపికైన వారి జాబితాలను ప్రకటిస్తామని జెసి వివరించారు.
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్