Nov 22,2020 20:30

మంగుళూరు : త్వరలో అమెరికా ప్రథమ మహిళగా వ్యవహరించనున్న జిల్‌ బైడెన్‌ పాలసీ డైరెక్టర్‌గా కర్ణాటక మూలాలు ఉన్న మాలా అడిగ నియమించబడ్డారు. మాలా అడిగది ఉడిపి జిల్లాలోని కుందపుర్‌ తాలుకాలోని కక్కున్జే గ్రామం కాగా, కర్ణాట బ్యాంక్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు కె సూర్యనారాయణ అడిగ, 2008లో మాన్‌ బుకర్‌ ప్రైజ్‌ గెలుచుకున్న అరవింద్‌ అడిగ కుటుంబానికి చెందినవారు. ఈ విషయాలను కుందపుర్‌లో మాలా మేనత్త నిర్మలా ఉపాధ్య విలేకరులకు తెలిపారు. సర్జన్‌గా పనిచేసే మాలా తండ్రి డాక్టర్‌ రమేష్‌ అడిగ (84) తన 25వ యేట అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. మాలా తల్లి జయ అడిగ వెల్లూర్‌లో వైద్య విద్యను అభ్యసించారని నిర్మలా తెలిపారు. మాలా తన భర్త చార్లెస్‌,కుమార్తె ఆశాతో కలిసి గత ఏడాది భారత్‌ను సందర్శించినట్టు వెల్లడించారు.
నినినినినినినిా