Nov 30,2020 20:39

సూపరింటెండెంట్‌తో మాట్లాడుతున్న సిపిఎం రూరల్‌ కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు

సూపరింటెండెంట్‌తో మాట్లాడుతున్న సిపిఎం రూరల్‌ కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు
జిజిహెచ్‌లో అధికారుల నిర్లక్ష్యం
ప్రజాశక్తి-నెల్లూరు :తుపాన్‌ కారణంగా జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో జిజిహెచ్‌లోని సెల్లార్‌ ప్రాంతంలో చేరిన నీటిని బయటకు తరలించడంలో అధికారులు స్పందించకపోవడం దారుణమని సిపిఎం రూరల్‌ కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం జిజిహెచ్‌లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడటం, వెంటిలేటర్లపై చికిత్సలు పొందుతున్న రోగులు పల్మనాలజీ విభాగానికి తరలించడం, ఉన్నతాధికారులు హుటాహుటిన చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకున్నారు.సమాచారం తెలుసుకున్న సిపిఎం రూరల్‌ కమిటీ నాయకుల సోమవారం జిజిహెచ్‌కి చేరుకొని పరిశీలించారు.ఈ సందర్భంగా సిపిఎం రూరల్‌ కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా సెల్లారులో నీరు చేరడంతో విద్యుత్‌ సరఫరా కు అంతరాయం ఏర్పడిందన్నారు. విద్యుత్‌ సరఫరా చేసేందుకు మరమ్మతులు చేసే కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించడంతో అత్యవసర సేవా విభాగంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందన్నారు. ఈ కారణంగా 6 మంది రోగులు మరణించినట్లు సమాచారం తెలిసిందన్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి వాస్తవంగా విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో రోగులు మరణించారా..లేక మరే కారణాలతో మృతిచెందారా.. మీడియాలో వచ్చిన కథనాల్లో వాస్తవాలున్నాయా లేవా విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవా లన్నారు. అనంతరం వైద్యశాల సూపరింటెండెంట్‌ను కలిసి జిజిహెచ్‌లో పరిస్థితి మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.కార్యక్రమంలో రూరల్‌ కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు బి.కష్ణయ్య, రూరల్‌ కమిటీ సభ్యులు డి.సంపత్‌ కుమార్‌, కిన్నెర కుమార్‌,వీర్ల శ్రీనివాసులు, శాఖ కార్యదర్శి ఎస్‌కె జిలాని, డివైఎఫ్‌ఐ రూరల్‌ కార్యదర్శి కె కోటేశ్వరరావు పాల్గొన్నారు.