Mar 05,2021 18:58

mantri peddireddy ki pushpagutyam estunna sarpanch

జగన్‌ ప్రతిష్టను పెంపొందించాలి : మంత్రి పెదిరెడ్డి
ప్రజాశక్తి-గన్నవరం
గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులు సమర్ధవంతంగా పాలన సాగించి సిఎం జగన్‌ ప్రతిష్టను పెంపొందించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖామాత్యులు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన మంత్రి పెదిరెడ్డిని గన్నవరం సర్పంచ్‌ నిడమర్తి సౌజన్య, ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు గౌసాని, చౌదరి, నిడమర్తి నాగేశ్వరరావు కలిశారు. నియోజక కేంద్రమైన గన్నవరంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సౌజన్యను మంత్రి దుశ్శాలువాతో సత్కరించారు. పార్టీ అభ్యున్నతికి కృషి చేయడంతో పాటు మంచి పాలన అందించాలన్నారు.