Oct 28,2021 19:35

airport lo nagarjuna

జగన్‌ నా మిత్రుడు..అందుకే కలిశా
సినీ నటుడు నాగార్జున
ప్రజాశక్తి-గన్నవరం
విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో గురువారం సినీనటుడు అక్కినేని నాగార్జున తళుక్కున మెరిశారు. ఈసందర్భంగా ఎయిర్‌ పోర్టులో మీడియాతో మాట్లాడుతూ ఆయన విజయవాడ రావడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. సీఎం జగన్‌ నా శ్రేయోభిలాషి అని, జగన్‌ చూసి చాలా రోజులు కావడంతో విజయవాడ వచ్చినట్లు చెప్పారు. జగన్‌తో కలిసి లంచ్‌ చేశానన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ కు బయల్దేరి వెళ్లారు.
------------------------------------