Feb 23,2021 21:54

అమరావతి బ్యూరో: జెఇఇ తొలి విడత ఆన్‌లైన్‌ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు పేపర్‌ా2 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. బిటెక్‌ సీట్లు కోసం పేపర్‌ా1, బీఆర్క్‌/ బిప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్‌ా2 పరీక్ష నిర్వహిస్తారు. నాలుగు రోజులు పాటు జరగనున్న ఈ పరీక్షలకు రాష్ట్రం నుంచి 87,797 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక విడత, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ రెండో విడత పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలోని విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, పొద్దుటూరు, సూరంపాలెం, నరసరావుపేట కేంద్రాల్లో జరిగిన తొలి రోజు పరీక్షకు వేలాది మంది హాజరయ్యారు. తొలిసారిగా ఇంగ్లీషు, హిందీతో పాటు తెలుగు సహా మరో 11 ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించారు. పేపర్‌ా2ఎ, బిలలో 105 ప్రశ్నలిచ్చి కరోనా కారణంగా ఛాయిస్‌ కూడా ఇచ్చారు. అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలన్న నిబంధన కారణంగా విద్యార్థులంతా ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం జరిగే పరీక్షకు 7:30 నుంచి 8:30 గంటల మధ్య పరీక్షా కేంద్రంలోకి అనుమతించగా, రెండో పూట పరీక్షలు రాసిన వారిని మధ్యాహ్నం 2 నుంచి 2:30 గంటల మధ్య అనుమతించారు.