May 04,2021 12:14

రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి) : రాజమహేంద్రవరం జైలులో ఉన్న సంగం డెయిరీ డైరెక్టర్‌ గోపాలకృష్ణన్‌ కరోనా బారినపడినట్లు రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌ రాజారావు ప్రకటించారు. సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలతో రాజమహేంద్రవరం జైలులో గోపాలకృష్ణన్‌ ఉన్నారు. రాజారావు మాట్లాడుతూ... గోపాలకృష్ణన్‌కు కోవిడ్‌ పాజిటివ్‌ నిర్థారణ కావడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ కోవిడ్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం గోపాలకృష్ణన్‌లో కరోనా లక్షణాలు కనిపించాయని అన్నారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో జైలు అధికారులు నిన్న రాత్రి గోపాలకృష్ణన్‌కు పరీక్షలు చేయించగా.. కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయిందన్నారు. గోపాలకృష్ణన్‌తోపాటు ఇదే అభియోగాలతో జైలులో ఉన్న గురునాథం, ధూళిపాళ్ల నరేంద్రకు కూడా నేడు కోవిడ్‌ పరీక్షలు చేయిస్తామని జైలు సూపరింటెండెంట్‌ రాజారావు పేర్కొన్నారు.