Oct 27,2021 22:31

విద్యార్థిని అభినందిస్తున్న దశ్యం

ప్రజాశక్తి- ఆళ్లగడ్డ : స్థానిక విశ్వశాంతి ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆకుల వినరు జాతీయ స్థాయి త్రోబాల్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల ఆళ్లగడ్డలో జరిగిన రాష్ట్ర స్థాయి త్రో బాల్‌ పోటీలలో వినరు మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. బుధవారం పాఠశాలలో విద్యార్థి వినరుని కరస్పాండెంట్‌ శ్రీనాథ్‌ రెడ్డి అభినందించారు. ఈ నెల 29న పంజాబ్‌ రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి త్రోబాల్‌ పోటీలలో వినరు పాల్గొననున్నారని ఆయన తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయులు రవి, విజరు పాల్గొన్నారు.