
టెహ్రాన్: ఇరాన్‌కు చెందిన ప్రసిద్ధ న్యూక్లియర్ శాస్త్రవేత్త మొహ్సేన్ ఫక్రీజాదే(59) శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. టెహ్రాన్ శివారులో తన వాహనంలో వెళ్తున్న ఫక్రిజాదేపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ ఫక్రీజాదే ఆసుపత్రిలో పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచారు. ఈ హత్య వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉన్నట్లు ఇరాన్ ఆరోపించింది. దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ జావేద్ జరీఫ్ ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. టెహ్రాన్‌లో హత్యకు గురైన మొహసేన్ వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని, అయితే హత్యకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా ఇరాన్ ప్రయత్నిస్తోందని లేఖలో తెలిపారు. తమ శాస్త్రవేత్త హత్యపై తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొన్నారు. ఇరాన్ రక్షణశాఖకు చెందిన రీసర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ అధిపతిగా ఫక్రిజాదే పనిచేశారు. ఫక్రిజాదేపై ఇంతకుముందు పలుమార్లు హత్యాప్రయత్నాలు జరిగాయి. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు.