May 02,2021 19:28

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో కొద్దిసేపటిలో ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య ఆసక్తికరపోరు జరగనుంది. గత మ్యాచ్‌లో కేకేఆర్‌ పై ఘన విజయంతో ఫుల్‌ జోష్‌లో ఉన్న ఢిల్లీని పంజాబ్‌  మ్యాచ్ లో కూడా అదే జోష్ కొనసాగిస్తుందో లేదో చూడాలి. ఇక పంజాబ్‌ కూడా గత మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడించి ట్రాక్‌ ఎక్కినట్లే కనిపిస్తుంది. ఇక టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది.అయితే ఈ మ్యాచ్‌కు పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అందుబాటులో లేకపోవడంతో మయాంక్‌ అగర్వాల్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.