Sep 15,2021 20:04

న్యూఢిల్లీ : ఐపిఎల్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌. యుఏఇ వేదికగా జరగనున్న ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌)లో పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుతించనున్నట్లు నిర్వాహకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది మార్చిలో భారత్‌ వేదికగా జరిగిన సీజన్‌ా14 ఐపిఎల్‌ మ్యాచ్‌లకు కరోనా నేపథ్యంలో ప్రేక్షకులకు అనుమతివ్వలేదు. కానీ మేలో ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో అర్ధాంతరంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే. కానీ సెప్టెంబర్‌ 19న ముంబయిాచెన్నై జట్ల మధ్య దుబారు వేదికగా తిరిగి ప్రారంభం కానున్న పోటీలకు మాత్రం పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతివ్వనున్నారు. 'ప్రేక్షకులకు స్టేడియాల్లో అనుమతివ్వడం అభిమానులకు నిజంగా శుభవార్తే' అని ఐపిఎల్‌ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఐపిఎల్‌ మ్యాచ్‌లు దుబారు, షార్జా, అబుదాబి వేదికగా మ్యాచ్‌లు జరగనున్నట్లు యుఏఇ ప్రభుత్వం తెలిపింది. 2019 తర్వాత ప్రేక్షకుల సమక్షంలో ఐపిఎల్‌ జరగడం ఇదే తొలిసారి. గత ఏడాది (2020) ఐపిఎల్‌ సీజన్‌ా13 ప్రేక్షకుల్లేకుండా ద్వారాలు మూసి నిర్వహించడం జరిగింది. కానీ సీజన్‌ా14 ఐపిఎల్‌ తొలి అర్ధభాగం కూడా అలాగే జరిగినా.. కొందరు ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో అర్ధాంతరంగా వాయిదా పడింది. యుఏఇలోని ప్రధాన స్టేడియాల్లో జరిగే ఐపిఎల్‌లో కనీసం 50% ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించనున్నారు. మిగిలిన ఐపిఎల్‌కు సంబంధించిన టికెట్లను www.iplt20.com, PlatinumList.net ద్వారా కొనుగోలు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్‌ 15న ఐపిఎల్‌ ఫైనల్‌ అనంతరం రెండు రోజుల తర్వాత యుఏఇ, ఓమన్‌ వేదికలుగా టి20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే.