Oct 28,2021 20:04

ఇప్పనపాడులో పారిశుధ్య పనులను చేపడుతున్న కార్మికులు

ప్రజాశక్తి- మండపేట
సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తుగా మండంలోని ఇప్పనపాడు గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టారు. ఉపసర్పంచ్‌ కుంచె దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో గ్రామంలోని అన్ని వీధుల్లో దోమల మందును పారిశుధ్య కార్మికులు పిచికారి చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ మాట్లాడుతూ ఇటీవల గ్రామంలోని అన్ని డ్రెయిన్లలో పూడిక తీత పనులు చేపట్టామన్నారు. గ్రామ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఆరోగ్యాలను కాపాడుకోవాలన్నారు. చెత్తను డ్రెయినేజీల్లో వేయకుండా ఇళ్ల వద్దకు వచ్చే పారిశుధ్య కార్మికులకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు యలమంచిలి ఆనందరాజు,సేనాపతి నాగమణి, శానిటేషన్‌ సూపర్‌వైజర్‌ మగ్గం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.