
గ్రేటర్ విశాఖ బ్యూరో: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యంత భారీ క్షిపణీ 'వరుణస్త్ర' ఆదివారం భారత నావికాదళంలో చేరింది. ఎన్ఎస్టిఎల్లో డిజైన్ చేసి, మన ప్రభుత్వ రంగ సంస్థ బిడిఎల్లో ఈ క్షిపణి తయారైంది. ఈ మేరకు బిడిఎల్లో నిర్వహించిన కార్యక్రమానికి డిఆర్డిఒ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుణాస్త్ర సముద్ర పోరాటంలో అండర్ వాటర్ ఫైటర్గానూ, వాటర్ నుంచి గాలిలోకి ఫైర్ ఫైటర్గానూ పని చేస్తుందని తెలిపారు. వరుణాస్త్రను తీర్చి దిద్దిన బిడిఎల్, ఎన్ఎస్టిఎల్ ఉద్యోగులను, సైంటిస్టులను డిఆర్డిఒ చైర్మన్ అభినందించారు. కార్యక్రమంలో బిడిఎల్ వైస్ అడ్మిరల్, షిప్ బిల్డింగ్ సెంటర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.శ్రీనివాస్, డైరెక్టర్ జనరల్ నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్ సైంటిస్ట్ డాక్టర్ సమీర్ వి.కామత్, ఎన్ఎస్టిఎల్ అవుట్ స్టాండింగ్ సైంటిస్ట్ ఓఅర్.నందగోపన్, బిడిఎల్ రిటైర్డ్ సిఎండి కమోడోర్ సిద్ధార్ధ మిశ్రా, బిడిఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఎన్పి.దివాకర పాల్గొన్నారు.