
ప్రజాశక్తి- ఇచ్ఛాపురం : మండలంలోని కొలిగాంలో మా గగడసుని క్రికెట్ టోర్నీ ఉత్కంఠ భరితంగా సాగింది. ఆదివారం నిర్వహించిన ఈ టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. తుది మ్యాచ్‌లో కలియ జట్టు, సుమన్ జట్లు తలపడ్డాయి. కలియ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎచ్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సుమన్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో 89 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్ చేసిన కలియ జట్టు 11.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసి, విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా తులసి, ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా సుమన్, ఉత్తమ బౌలరుగా ప్రదీప్ ఎంపికయ్యారు. విజేతలకు ముఖ్య అతిథులు విశ్రాంత హెచ్ఎం అనంతరామ మహాపాత్రో, దీన బంధు రెడ్డి, వి.రమణ, చంద్రయ్య, బాలరాజు, రవీంద్రనాయక్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.