Nov 27,2020 18:08

వాషింగ్టన్‌ : అమెరికా ఆర్థిక పరిస్థితి రోజు రోజుకీ దిగజారుతోంది. ఉద్యోగాలు కోల్పోయాం.., సాయం చేయండి మహాప్రభో అంటూ... అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయినవారి ఆక్రందన ఇది. ప్రతివారం లక్షల సంఖ్యలో  కార్మిక శాఖకు దరఖాస్తులు వచ్చిపడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.., ఉపాధి లేదు.., ఉద్యోగం కోల్పోయాం,.. సాయం చేయండి అంటూ నవంబరు 25నాటికి కార్మికశాఖకు 7,78,000 దరఖాస్తులు వచ్చాయి. అయితే,  క్రితం వారంతో పోల్చితే ప్రభుత్వ సాయం కోసం క్లెయిమ్‌ చేసుకున్నవారి సంఖ్య 30వేలు పెరిగింది. ఈ దరఖాస్తుల సంఖ్యలో వరుసగా రెండోవారం కూడా పెరుగుదల నమోదయింది. ఆర్థికమాంద్యం, కరోనా నేపథ్యంలో తలెత్తిన సంక్షోభం వల్ల అమెరికాలో వర్తక, వాణిజ్య సంస్థలు పెద్ద సంఖ్యలో మూతపడ్డాయి. వివిధ రంగాల్లో పరిశ్రమలు హఠాత్తుగా మూతపడటంతో లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు.  దీంతో ప్రభుత్వ సాయం కోసం 'క్లెయిమ్‌' చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.