Nov 24,2020 10:42

హైదరాబాద్‌: నాన్న చివరి చూపు కోసం హైదరాబాద్‌ రావాలనుకున్నప్పటికీ.. అమ్మ వారించిందని, నాన్న కలలను గుర్తు చేసిందని, అందుకే తాను దేశం తరపున ఆడి నాన్న కలను నిజం చేయడానికి నిశ్చయించుకున్నాని హైదరాబాదీ క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్‌ బిసిసిఐ వీడియో ఇంటర్వ్యూలో తెలిపారు. నాన్న భౌతికంగా లేకపోయినా ఆయనెప్పుడూ తనతో ఉంటాడని పేర్కొన్నారు. సిడ్నీలో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడిన తర్వాత తండ్రి చనిపోయారని తెలిసిందని, ఆ సమయంలో కెప్టెన్‌ కోహ్లీతో పాటు ఇతర క్రికెటర్లు తనకు అండగా నిలిచారని.. ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. సిరాజ్‌ తండ్రి మహ్మద్‌గౌస్‌ శుక్రవారం మరణించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యనటలో ఉండడంతో తండ్రి అంత్యక్రియలకు దూరమయ్యాడు. దీనిపై బిసిసిఐ మాట్లాడుతూ సిరాజ్‌ స్వదేశానికి వెళ్లేందుకు ఆప్షన్‌ ఇచ్చామని.. కానీ ఈ పేసర్‌ భారత జట్టుతో ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటనలో వెల్లడించింది.