
పెట్రోల్ ధర మూడో రోజు కూడా పెరిగింది. డీజిల్ ధర కూడా ఇదే దారిలో నడిచింది. హైదరాబాద్లో ఆదివారం లీటరు పెట్రోల్ ధర 9 పైసలు పెరుగుదలతో రూ.84.73కు చేరింది. డీజిల్ ధర కూడా 21 పైసలు పెరుగుదలతో రూ.77.56కు ఎగసింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది వరుసగా మూడో రోజు. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 8 పైసలు పెరుగుదలతో రూ.87.65కు చేరింది. డీజిల్ ధర 20 పైసలు పెరుగుదలతో రూ.80.05కు ఎగసింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 8 పైసలు పెరుగుదలతో రూ.87.18కు చేరింది. డీజిల్ ధర 20 పైసలు పెరుగుదలతో రూ.79.61కు ఎగసింది.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధర పెరిగింది. 8 పైసలు పెరుగుదలతో రూ.81.46కు చేరింది. డీజిల్ ధర 19 పైసలు పెరుగుదలతో రూ.71.07కు ఎగసింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 7 పైసలు పెరుగుదలతో రూ.88.16 చేరింది. డీజిల్ ధర 20 పైసలు పెరుగుదలతో రూ.77.54 ఎగసింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 2.06 శాతం పెరుగుదలతో 45.11 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటిఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 1.29 శాతం పెరుగుదలతో 42.44 డాలర్లకు ఎగసింది.