పసి పిల్లల ఎదుగుదలలో కీలకపాత్ర పోషించేది తల్లి. తల్లుల జీవితాలు పిల్లల చుట్టూ గూడు అల్లుకొని ఉంటాయి. బిడ్డలకు ఎలాంటి బాధ కలిగినా తల్లి తల్లడిల్లిపోతుంది.
ఢిల్లీ సరిహద్దుల్లో రైతు దీక్షకు ప్రకృతే పరీక్షలు మానుకుంది
మంచు తుంపరలు ముత్యాల అక్షింతలై దీవించాయి
అకాల వర్షపు జల్లులు వొంగి నమస్కరించి విజయోస్తు అన్నాయి
మరమనిషికి మనసును
బిగించే పండుగ ఇది!
మనసు గది తలుపులు తెర్చి
మరుగున పడ్డ మమతల
మధురానుభూతుల్ని కొత్త
బట్టల్లా కట్టి పిండివంటల్లా
తినిపించి బంధుమిత్రుల్ని
చెమట చుక్కలు కన్నీటి చుక్కలై
చెదిరిపోతున్న కాలం
బతుకు వాకిట్ల ఏ చుక్కలు పెట్టను
బతుకు దెరువు అనేక మెలికలు పడి
ఊపిరి సలుపని చోట
వాకిలంతా ఏ మెలికల ముగ్గేయను !