ప్రజాశక్తి - బెళగల్: సొసైటీ సింగిల్ విండో మండల అధ్యక్షుడు కొండాపురం గోపాల్ రెడ్డి కుమారుడు, వైసిపి మండల నాయకులు మనోహర్ రెడ్డి(45) అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య సోమవారం జరిగాయి. ఆదివారం ఆయన అనారోగ్యంతో మతి చెందారు. మృతదేహం అర్ధరాత్రి 12 గంటలకు హైదరాబాద్ నుండి స్వగ్రామంకు తీసుకొచ్చారు. సోమవారం ఈ వార్త తెలిసి ఎంపీ టిజి వెంకటేష్, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, లలితమ్మ, కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మురళీకష్ణ, మూడుమాల రాధాకష్ణ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, చిన్న కొండయ్య, గోపాల్, వైసిపి మండల కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి, బావికటి మద్దిలేటి, తులసి రెడ్డి,ఎస్ ఎం బాషా, శంకర్ రెడ్డి, వైసిపి జడ్పిటిసి అభ్యర్థి గిరిజోన్, మాజీ జడ్పిటిసి శేఖర్, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, మరికొందరు ఆయన మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అంతిమయాత్ర