Dec 03,2021 19:36

ఈ ఏడాది బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన సూర్య చిత్రం 'జై భీమ్‌' విడుదలైనప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇప్పుడు ఈ చిత్రం అధికారికంగా గోల్డెన్‌ గ్లోబ్స్‌ 2022లోకి ప్రవేశించి మరో అరుదైన విజయం సాధించింది. అందరి హృదయాన్ని ద్రవింపజేసిన ఈ చిత్రం 'బెస్ట్‌ నాన్‌-ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌' విభాగంలో నామినేషన్‌గా ప్రవేశించింది. 'ది షావ్‌శాంక్‌ రిడంప్షన్‌', 'ది గాడ్‌ ఫాదర్‌' ఐఎండిబిలో రికార్డు స్థాయి రేటింగ్‌లను బ్రేక్‌ చేసి మొదటి స్థానంలో 9.6 రేటింగ్‌తో నిలిచి ఈ అరుదైన ఘనత సాధించింది.