Jan 25,2021 21:30

అమరావతి బ్యూరో: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్‌ బోర్డు విడుదల చేసింది. 2020ా21 విద్యా సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఫిబ్రవరి 11లోపు విద్యార్థులు ఫీజు చెల్లించాలని బోర్డు కార్యదర్శి వి రామకృష్ణ సోమవారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. దరఖాస్తు ధర రూ.10గా నిర్ణయించారు. జనరల్‌ కోర్సు రెగ్యులర్‌ విద్యార్థులకు పరీక్ష ఫీజు కింద రూ.490, ప్రాక్టికల్‌ ఫీజు కింద రూ.190గా నిర్ణయించారు. ప్రథమ లేదా ద్వితీయ సంవత్సరం థి¸యరీ పేపర్లకు రూ.490 చెల్లించాలి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెండు పేపర్లకు రూ.1170, ప్రాక్టికల్స్‌కు రూ.190 చెల్లించాలి. వొకేషనల్‌ కోర్సు విద్యార్థులు కూడా రూ.490తో పాటు ప్రాక్టికల్స్‌కు రూ.190 చెల్లించాలి. వొకేషనల్‌ బ్రిడ్జ్‌కోర్సు కోర్సు విద్యార్థులు రూ.135, రెండు సంవత్సరాల సబ్జెక్టులకు కలిపి రూ.270గా నిర్ణయించారు. ఉత్తీర్ణత చెందిన విద్యార్థులు ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలకు హాజరు కావాలంటే ఆర్ట్స్‌ విద్యార్థులు రూ.1170, సైన్స్‌ విద్యార్థులు రూ.1360 చెల్లించాలని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు bఱవ.aజూ.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ ద్వారా నేరుగా ఫీజు చెల్లించవచ్చునని వివరించారు.