Nov 21,2020 00:56

నేవీ కార్పెట్‌లో పాల్గొన్న ఐఎన్‌ షిప్స్‌ కార్ముక్‌

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో
ఇరు దేశాల మధ్య అంతర్గత భద్రతలో భాగంగా ప్రతి ఏటా 2 పర్యాయాలు నిర్వహించే ఇండో-థారు 30వ ఎడిషన్‌ (ఇండియా-థారులాండ్‌ కోఆర్డినేటెడ్‌ పేట్రోల్‌ (కార్పాట్‌) కార్యక్రమం ఈ నెల 18న ప్రారంభమై శుక్రవారం 20తో ముగిసినట్లు భారత నావికాదళం ప్రకటించింది. ఐఎన్‌ షిప్స్‌ కార్ముక్‌ (దేశీయంగా నిర్మితమైన క్షిపణి), థారుల్యాండ్‌కు చెందిన నౌక క్రాబురి చావో ఫ్రాయా క్లాస్‌ డార్నియర్‌ మెరిటైం పేట్రోల్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ ఈ విన్యాసాల్లో కార్పాట్‌ కార్యక్రమంలో పాల్గొన్నాయి. భారత్‌ విజన్‌ అయిన సాగర్‌ (సెక్యూరిటీ అండ్‌ గ్రోత్‌ ఆఫ్‌ ఆల్‌ ఇన్‌ ద రీజియన్‌)లో భాగంగా సముద్రంపై సహకరించుకునే విధానాన్ని భారత్‌ రక్షణ దళం అనుసరిస్తోంది. థారులాండ్‌ భారత్‌ స్నేహపూర్వక వాతావరణంలో ఈ మూడు రోజుల పాటు కార్పాట్‌లో చర్చలు, విన్యాసాలు, ఇంటరాక్షన్స్‌ చేపట్టాయి. 2005 సంవత్సరంలో ఇరుదేశాల మధ్య కార్పాట్‌ మొదలైంది. రారు థారు నేవీ, ఇండో నేవీ మధ్య బలమైన అంతర్గత భద్రత, సంబంధాల మెరుగుకు ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు భారత నావికాదళం శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో వెల్లడించింది.