Nov 28,2020 22:53

JC

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' పథకంలో భాగంగా ఇళ్లస్థలాల పంపిణీకి ఎలాంటి అవ రోధాలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంయుక్త కలెక్టర్‌ జె.వెంకట మురళి అధికారు లను ఆదేశించారు. స్థానిక జెసి ఛాంబర్‌లో శనివారం ఇళ్లస్థలాల పంపిణీపై ఆయన ప్రత్యేక అధికారులతో సమీక్షించారు. జేసీ మాట్లాడుతూ డిసెంబర్‌ 25న ఇళ్లస్థలాలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించటంతో ఇందుకు సంబంధించి ఏర్పాట్లలో ఎలాంటి జాప్యం లేకుండా చూసుకోవాలన్నారు. లబ్ధిదారులకు పంపిణీ చేయటానికి లాటరీ ప్రక్రియను పూర్తి చేసి ప్లాట్లను సిద్ధంగా ఉంచాలని దేశించారు. కోర్టు స్టేలు ఉన్న చోట అవకాశం ఉంటే ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించాలన్నారు. సమావేశంలో ఇన్‌ఛార్జి జెసి కృష్ణవేణి, డిఆర్‌ఒ కె.వినాయకం, కందుకూరు సబ్‌ కలెక్టర్‌ భార్గవ్‌ తేజ్‌, ఒంగోలు, మార్కాపురం ఆర్డీవోలు ప్రభాకర రెడ్డి, శేషిరెడ్డి, డ్వామా పీడీ శీనారెడ్డి, స్పెషల్‌ డిప్యూటీకలెక్టర్లు గ్లోరియా, చంద్రలీల, సరళ వందనం, హౌసింగ్‌ పీడీ సాయినాధ్‌ పాల్గొన్నారు.