Sep 15,2021 22:31

వినతిపత్రం ఇస్తున్న నాయకులు

ప్రజాశక్తి- పెద్దాపురం నాలుగేళ్ల క్రితమే పూర్తయిన టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం టిడ్కో చైర్మన్‌ ప్రసన్న కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో 3,300 మంది లబ్ధిదారులను ఈ పథకానికి ఎంపిక చేశారన్నారు. 2016- 17 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతగా 1,728 మందికి అపార్ట్‌మెంట్లు కేటాయించారన్నారు. వీరిలో 700 మంది లబ్ధిదారులు రూ.లక్ష, 580 మంది లబ్ధిదారులు రూ.50 వేలు అధిక వడ్డీలకు అప్పు చేసి లబ్ధిదారుని వాటా దనంగా చెల్లించారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కూనిరెడ్డి అప్పన్న, దారపురెడ్డి కృష్ణ, రొంగల వీర్రాజు, యాసలపు రమేష్‌, ఆర్‌.రామారావు పాల్గొన్నారు.