Nov 29,2020 23:42

మాట్లాడుతున్న ఎస్‌ఎస్‌ చెంగయ్య

ప్రజాశక్తి - మంగళగిరి : పట్టణంలోని గండాలయపేట ఎస్‌టి కాలనీలోని పేదల ఇళ్లను గిరి ప్రదక్షణ పేరుతో తొలగించడాన్ని ఆ ప్రాంత ప్రజలు ఐక్యతతో ఉండి కాపాడుకోవాలని సిపిఎం పట్టణ కార్యదర్శి ఎస్‌.ఎస్‌.చెంగయ్య పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి ఆ గిరిజన కాలనీలో స్థానిక సిపిఎం నాయకులు ఈగ సాంబయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. చెంగయ్య మాట్లాడుతూ అధికార యంత్రాంగం, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేద ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇల్లు తొలగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పేదలకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించి ఇచ్చే వరకూ ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం సుబ్రహ్మణ్యం, ఏం బాలాజీ, బ్రాహ్మణి పాల్గొన్నారు.