Mar 02,2021 22:04

సమావేశంలో మాట్లాడుతున్న రామచంద్రరావు

బొండపల్లి: మండలంలో కొత్తగా నిర్మించనున్న ఇళ్లకు సంబంధించి జియోట్యాగింగ్‌ తప్పనిసరిగా చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని విజయనగరం డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి కె.రామచంద్రరావు సూచించారు. మంగళవారం గజపతినగరం సబ్‌డివిజన్‌ పరిధిలోని గజపతినగరం, బొండపల్లి, దత్తిరాజేరు, మెంటాడ మండలాలకు చెందిన గృహనిర్మాణశాఖ అధికారులతో పాటు సచివాలయాల ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లతో సమావేశమయ్యారు. ఇళ్ల స్థలాల మ్యాపింగ్‌, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు లబ్ధిదారుల పేరున చేయడంతో పాటు జియోట్యాగింగ్‌ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. లక్ష్యాలు పూర్తిచేయని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.