Nov 30,2020 19:33

ఇళ్ల స్థలాల పూడిక పనులను ప్రారంభించిన జి.సత్యనారాయణ

ప్రజాశక్తి - వీరవాసరం
మండలంలో ప్రభుత్వ ఇళ్ల స్థలాల పూడిక పనులు ప్రారంభమయ్యాయి. కొణతివాడలో ఐదున్న ఎకరాల స్థలం పూడికకు వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ గొలగాని సత్యనారాయణ సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా గొలగాని మాట్లాడుతూ చెప్పింది ఆచరణలో చూపించేది జగన్‌ ప్రభుత్వమేనన్నారు. ఇప్పటికే మండలంలో కొన్ని గ్రామాల్లో స్థలాల పూడిక అరకొరగా పూర్తి చేశారని, ఇళ్ల స్థలాల పట్టాలు డిసెంబర్‌లో అందజేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో ఆ దిశగా మరలా అధికారుల చర్యలు తీసుకుంటున్నారు. ఆ దిశగానే కొణితివాడ స్థలం పూడిక పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు నాగరాజు శ్రీనివాసరాజు, యరకరాజు చినబాబు, కార్యదర్శి దుర్గప్రసాదు పాల్గొన్నారు.