Nov 26,2020 22:38

ఇళ్ల స్థలాల పంపిణీపై సమీక్ష

ప్రజాశక్తి - నరసాపురం
ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో హౌసింగ్‌ అధికారులతో ఎంఎల్‌ఎ ముదునూరి ప్రసాదరాజు గురువారం సమీక్షించారు. వచ్చే నెల 25న ప్రభుత్వం పేదలకు పంపిణీ చేయనున్న ఇళ్ల స్థలాలు, లే అవుట్స్‌ గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ నియోజకవర్గంలో మొత్తం 8,266 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని తెలిపారు. నరసాపురం అర్బన్‌కి సంబంధించి 4635, రూరల్‌కు 2643, మొగల్తూరుకు 988 ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. నరసాపురం నియోజకవర్గంలో 71 లే అవుట్స్‌ ఉండగా నరసాపురం అర్బన్‌ 2 లే అవుట్స్‌, నరసాపురం రూరల్‌ 44, మొగల్తూరు 25 లే అవుట్స్‌ ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ రామచంద్రారెడ్డి, ఇఇ ఆది సుబ్రహ్మణ్యం, డిఇ పిచ్చియ్య పాల్గొన్నారు.