May 16,2021 12:04

ముంబయి : కరోనా మహమ్మారితో అల్లల్లాడుతున్న ప్రజలపై మరింత భారం మోపుతోంది బిజెపి సర్కార్‌. పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌తో ప్రజలు పస్తులు ఉంటుంటే...ఇంధన ధరలు పెంచి మరింత బెంబేలెత్తిస్తోంది. దేశంలో ఆదివారం కూడా చమురు ధరలు పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై 24 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 27 పైసలను చమురు సంస్థలు పెంచాయి. మే 4 నుండి దేశంలో పెట్రో, డీజిల్‌ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇటీవల జరిగిన పలు అసెంబ్లీ ఎన్నికలు మొదలైన నాటి నుండి ఫలితాలు వెలువడే వరకు చాలా నిలకడగా ఉన్న ఇంధన ధరలు...ఫలితాల అనంతరం పెరగుతూ ఉండటం గమనార్హం. ఢిల్లీలో రికార్డు స్థాయికి ఇంధన ధరలు నమోదయ్యాయి. ఇక ఆయా రాష్ట్రాల్లో విధించే వ్యాట్‌, ఇతర పన్నులు కలుపుకుని ధరలు మారుతూ ఉంటాయి.
వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయంటే...

ఇది మహమ్మారి దాడి కాదు....పెట్రో ధరల బాదుడు