
విధ్వంసకర ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌స్మిత్‌ను ఎదుర్కోవాలంటే ఎంత పెద్ద బౌలర్‌కైనా సవాలుతో కూడుకున్న పనే. ఎందుకంటే అతని బ్యాటింగ్ విధాన శైలి, ఆటతీరు, టెక్నిక్ చాలా భిన్నంగా ఉంటుంది. క్రీజులో అటూఇటూ కదులుతూ ఆడే స్మిత్‌కు బంతి ఎక్కడ వేయాలో బౌలర్ పసిగట్టలేడు. ఈ నేపథ్యంలో అడ్డుకోవాలంటే బారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారత బౌలర్లకు ఓ సలహా సూచించాడు. రాబోయే సీరిస్‌లో ఐదో స్టంప్‌లైన్‌పై బంతులు వేసి స్మిత్‌ను అడ్డుకోవచ్చని చెప్పాడు. స్మిత్‌ది భిన్నమైన టెక్నిక్ అని, టెస్టు మ్యాచ్‌లో ఆఫ్‌స్టంప్‌పై, ఆఫ్‌స్టంప్‌కు అటుఇటుగా లేదా ఫోర్త్ స్టంప్‌లైన్‌లో బౌలింగ్ చేయాలని సాధారణంగా బౌలర్లకు చెబుతుంటామని, కానీ స్మిత్ అటు ఇటు కదులుతూ ఉంటాడు కాబట్టి లైన్ నాలుగైదు అంగుళాలు దూరంగా బంతులు పడేలా.. నాలుగు, ఐదో స్టంప్ మధ్య ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని స్మిత్‌కు బంతులు వేయాలని సిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ చెప్పాడు. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్మిత్ చెప్పినట్లు చదివానని, బౌలర్లు తన విషయంలో దూకుడుగా ఉంటారని అతడు భావిస్తూ ఉండొచ్చని అన్నాడు. కానీ అతన్ని ఆఫ్‌స్టంప్‌పై, ఆఫ్‌స్టంప్ లోగిలిలో పరీక్షించాలని అన్నాడు. బ్యాక్‌ఫుట్‌పై ఆడిస్తూ త్వరగా పొరపాటు చేసేలా చేయాలని సూచించాడు.