Nov 29,2021 14:36

ప్రజాశక్తి-విజయనగరం : విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ - శిక్షణ కేంద్రంను నవంబరు 29న జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపీఎస్ ప్రారంభించారు. పోలీసుశాఖలో బి.టెక్, బిఎస్సీ కంప్యూటర్స్ చదివి, కానిస్టేబుళ్లుగా పని చేస్తున్న వారికి రెండు వారాల ఈ - శిక్షణలో భాగంగా కంప్యూటరు, సిడి రైటింగ్, ఆంగ్ల పరిజ్ఞానంలో శిక్షణ ఇచ్చి, వారి సేవలను పోలీసు స్టేషనులో వినియోగించు కోనున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపీఎస్  తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సత్యనారాయణ రావు, ఎస్ ఈ బి అదనపు ఎస్పీ కుమారి ఎన్.శ్రీదేవిరావు, ఓఎస్డీ ఎన్.సూర్యచంద్ర రావు, డిఎస్పీలు అనిల్ పులిపాటి, టి. త్రినాథ్, ఆర్.శ్రీనివాస రావు, ఎల్.శేషాద్రి, ఎస్బి సిఐలు ఎన్.శ్రీనివాస రావు, జి.రాంబాబు, డిసిఆర్ బి సిఐ బి.వెంకటరావు మరియు ఇతర సిఐలు పాల్గొన్నారు.