Oct 14,2021 13:56
ఇ-గ్రంథాలయాల దిశగా అడుగులు

ప్రజాశక్తి -వేటపాలెం : ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం స్థానిక సారస్వత నికేతనం గ్రంథాలయాన్ని రాష్ట్ర పౌర గ్రంథాలయాల  సంచాలకులు ఎం. ఆర్. ప్రసన్న కుమార్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ గ్రంధాలన్నింటినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించి 90 శాతం పూర్తి చేసినట్లు చెప్పారు. అందుకుగాను రాష్ట్రంలోనే పేరున్న గ్రంథాలయంగా సారస్వత నికేతనం ని సందర్శించి సూచనలు సలహాలు తీసుకునేందుకు గాను వచ్చినట్లు చెప్పారు. నాగులుప్పలపాడు ఉప్పుగుండూరు చిన్నగంజాం చీరాల గ్రంథాలయాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. గ్రంథాలయాల్లో డేటా ఎంట్రీ సాఫ్ట్ వేర్ తో  రాక్స్ నెంబర్స్, సెక్షన్స్ అప్డేట్ చేయనున్నట్లు చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఏ లైబ్రరీలో ఏ పుస్తకాలు ఎన్ని ఉన్నాయి... ఎక్కడెక్కడ ఉన్నాయి అనే సమగ్ర సమాచారం కూడా ఉండేవిధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సభ్యత్వం ఉన్న పాఠకులకు ఇంటి వద్దకే పుస్తకాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఇందుకుగాను అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. ప్రకాశం జిల్లాలో మొత్తం 58 గ్రంథాలయాలు ఉన్నట్లు వివరించారు వీటిని మూడు కేటగిరీలుగా విభజించి నడుపుతున్నట్లు చెప్పారు ముఖ్యంగా గ్రంథాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి మేధావులు ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించే విధంగా అభ్యర్థి ఇస్తున్నట్లు పేర్కొన్నారు సిబ్బంది కొరత అధిగమించేందుకు ప్రాతిపదికన 125 ఖాళీలను గుర్తించి ఫైల్ పెట్టినట్లు చెప్పారు తక్కువ సిబ్బంది ఉన్నచోట జనాభా ప్రాతిపదికన రెండు రోజులకోసారి మూడు రోజులకు ఓసారి గ్రంథాలయాలు తెరిచి ఉండే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు ఎవరైనా సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు చేపట్టనున్నట్లు ఆయన హెచ్చరించారు మహాత్మాగాంధీ నడయాడిన శాశ్వత నికేతనం గ్రంథాలయాన్ని సందర్శించడం గర్వకారణంగా ఉందన్నారు మహాత్మా గాంధీ వదలి వెళ్ళిన చేతికర్రను సూచించి ఆయన అనుభూతిని పొందారు పుస్తకాల అమరికలు నంబర్ విధానాన్ని ప్రభుత్వ గ్రంథాలయాల్లో కూడా ఈ వ్యత్యాసాన్ని బేరీజు వేసుకొని అమలు చేయటానికి కృషి చేస్తానన్నారు సారస్వత నికేతనం అభివృద్ధి అనుభవాలు తెలుసుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సెక్రటరీ బుర్రి కుమార్ రాజు సారస్వత నికేతనం వ్యవస్థాపక వారసుడు కె శ్రీనివాస్ కుమార్ ఆర్ సి బ్బంది శ్రీవల్లి శాంతారావు తదితరులు పాల్గొన్నారు